దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా రెండు వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 4,49,114 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 2,380 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,49,974కి చేరింది. నిన్న కరోనా కారణంగా 56 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,22,062కి చేరింది.
ఒక్క రోజులో 1,231 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,25,14,479కి చేరింది. ప్రస్తుతం దేశంలో 13,433 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.76 గా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 4.5 లక్షల మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 187.07 కోట్ల డోసులను పంపిణీ చేశారు.