దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య పెరిగాయి. నిన్న దేశ వ్యాప్తంగా 4,77,570 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 2,364 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,29,563 కి చేరింది. నిన్న కరోనా కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,303కి చేరింది.
గత 24 గంటల్లో 2,582 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,25,89,841 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 15,419 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.75 గా, రోజు వారి పాజిటివీ రేటు 0.50గా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 13,71,603 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,91,79,96,905 డోసులను పంపిణీ చేశారు.