దేశంలో కొత్త‌గా 2338 కేసులు

India reports 2338 new covid-19 infections.భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌ దేశ వ్యాప్తంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 May 2022 10:05 AM IST
దేశంలో కొత్త‌గా 2338 కేసులు

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌ దేశ వ్యాప్తంగా 3,63,883 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 2,338పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,58,087 కి చేరింది. 24 గంట‌ల్లో క‌రోనా కార‌ణంగా 19 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,24,630 కి చేరింది.

నిన్న 2,134 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,26,15,574కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 17,883 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న13,33,064 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,93,45,95,805 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story