దేశంలో కొత్త‌గా 2288 కేసులు

India reports 2288 new covid-19 infections.దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 May 2022 10:05 AM IST
దేశంలో కొత్త‌గా 2288 కేసులు

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య త‌గ్గింది. గ‌డిచిన 24 గంటల్లో 4,84,843 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 2288 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,07,689 కి చేరింది. నిన్న క‌రోనా కార‌ణంగా 10 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,24,103కి చేరింది.

గ‌త 24 గంట‌ల్లో 3,044 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,25,63,949కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 19,637 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.74 గా, రోజు వారి పాజిటివీ రేటు 0.47గా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 190.50 కోట్ల డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story