దేశంలో కొత్తగా 2259 కేసులు
India Reports 2259 new covid-19 infections.దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. రోజువారి కేసుల సంఖ్యలో హెచ్చు
By - తోట వంశీ కుమార్Published on : 20 May 2022 10:28 AM IST
Next Story

దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. రోజువారి కేసుల సంఖ్యలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4,51,179 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 2,259 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,31,822 కి చేరింది. నిన్న కరోనా కారణంగా 20 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,323కి చేరింది.
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) May 20, 2022
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/BD0qbAKL36 pic.twitter.com/CjO3wG0qwv