మళ్లీ పెరుగుతున్న కేసులు
India Reports 2208 new corona cases.దేశంలో ఇటీవల కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 28 Oct 2022 10:37 AM ISTదేశంలో ఇటీవల కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు రెండు వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 1,42,704 నిర్థారణ పరీక్షలు చేయగా కొత్తగా 2,208 కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,49,088కి చేరింది. నిన్న 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,28,999కి చేరింది.
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) October 28, 2022
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/46DzCcXgcb pic.twitter.com/pCiT7Qrpis
నిన్న 3,619 మంది కోలుకోగా.. మొత్తంగా ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,41,00,691కి చేరింది. ప్రస్తుతం దేశంలో 19,398 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.77 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.55 శాతంగా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిన్న 1,60,714 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 219.60 కోట్ల డోసులను పంపిణీ చేశారు.