దేశంలో కొన‌సాగుతున్న క‌రోనా విజృంభ‌ణ.. కొత్త‌గా ఎన్నికేసులంటే

India Reports 21880 new covid-19 infections.దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 4,95,359

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 July 2022 4:51 AM GMT
దేశంలో కొన‌సాగుతున్న క‌రోనా విజృంభ‌ణ.. కొత్త‌గా ఎన్నికేసులంటే

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 4,95,359 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 21,880 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,38,47,065కి చేరింది. నిన్న క‌రోనా కార‌ణంగా 60 మంది కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు 5,25,930 మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి మ‌ర‌ణించారు.

నిన్న 21,219 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,31,71,653 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,49,482 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.46 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.42 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 201.30 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story