దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,61,440 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా..2,183 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు సోమవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,44,280కి చేరింది. నిన్న కరోనా కారణంగా 214 ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,21,965కి చేరింది.
ఒక్క రోజులో 796 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని 1,985జయించిన వారి సంఖ్య 4,25,10,773కి చేరింది. ప్రస్తుతం దేశంలో 11,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.76 నమోదు అయింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 2,66,459మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,86,54,94,355 డోసులను పంపిణీ చేశారు.