దేశంలో కొవిడ్ మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,88,768 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 214 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,761కి చేరుకుంది. నిన్న కరోనా కారణంగా నలుగురు మరణించారు.
దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,30,718కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉంది. మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.01 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 220.13 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేశారు.