దేశంలో కొత్త‌గా ఎన్ని కేసులంటే..?

India Reports 2139 new covid-19 cases.భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Oct 2022 5:20 AM GMT
దేశంలో కొత్త‌గా ఎన్ని కేసులంటే..?

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 2,64,216 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 2,139 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. నిన్న 3,208 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న‌వారి సంఖ్య 4,40,63,406 మందికి చేరింది. నిన్న కరోనా కార‌ణంగా 9 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,28,835కి చేరింది.

ప్ర‌స్తుతం దేశంలో 26,292 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.76 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 0.71 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 5,03,576 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 219.09 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story