భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కొత్తగా 2,119 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,638,636 చేరింది.నిన్న 10 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,28,953కి చేరింది.
నిన్న 2,582 మంది కోలుకోగా.. మొత్తంగా ఈ మహమ్మారి నుంచి బయటపడిన వారి సంఖ్య 4,40,84,646. ప్రస్తుతం దేశంలో 25,037 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.76 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.13 శాతంగా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిన్న 4,63,338 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 219.50 కోట్ల డోసులను పంపిణీ చేశారు.