భారత్‌లో రోజువారి కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,09,088 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా కొత్తగా 2,112 పాజిటివ్ కేసులు వచ్చాయి. నిన్న నలుగురు మరణించారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,28,957కి చేరింది.
నిన్న 3,102 మంది కోలుకోగా.. మొత్తంగా ఈ మహమ్మారి నుంచి బయటపడిన వారి సంఖ్య 4,40,87,748. ప్రస్తుతం దేశంలో 24,043 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.76 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.01 శాతంగా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిన్న 2,90,752 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 219.53 కోట్ల డోసులను పంపిణీ చేశారు.