దేశంలో కొత్తగా 2,075 కేసులు.. మరణాలు ఎన్నంటే..?
India Reports 2075 New covid infections.దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. అయితే.. ఇతర దేశాల్లో కరోనా
By తోట వంశీ కుమార్ Published on 19 March 2022 4:46 AM GMTదేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. అయితే.. ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో భారత్‌లో కూడా నాలుగో వేవ్ వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. కరోనా జాగ్రత్తలు అందరూ పాటించేలా చూడాలి, టెస్టుల సంఖ్యను పెంచాలని, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని నిన్న రాష్ట్రలకు లేఖ రాసిన రాసింది.
ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో 3,70,514 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 2,075 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,06,080కి చేరింది. నిన్న 71 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,16,352కి చేరింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) March 19, 2022
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/9ulWxRUJnt pic.twitter.com/YO51LA4NVQ
ఒక్క రోజులో 3,383మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,24,61,926కి చేరింది. ప్రస్తుతం దేశంలో 27,802 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.73, రోజువారి పాజిటివిటీ రేటు కూడా 0.56 శాతంగా నమోదు అయింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 5.84 లక్షల మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 181.04 కోట్ల డోసులను పంపిణీ చేశారు.