దేశంలో మ‌ళ్లీ పెరుగుతున్న కేసులు.. కొత్త‌గా ఎన్నంటే

India Reports 2067 new covid 19 infections.దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. గ‌డిచిన 24

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 April 2022 10:22 AM IST
దేశంలో మ‌ళ్లీ పెరుగుతున్న కేసులు.. కొత్త‌గా ఎన్నంటే

దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. గ‌డిచిన 24 గంటల్లో 4,21,183 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 2,067 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,47,594కి చేరింది. నిన్న క‌రోనా కార‌ణంగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,22,006కి చేరింది.

ఒక్క రోజులో 1,547 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,25,13,248కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 12,340 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.76 న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 17,23,733 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,86,90,56,607 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story