కొన‌సాగుతున్న క‌రోనా వ్యాప్తి.. కొత్త‌గా ఎన్నికేసులంటే

India Reports 20557 new covid-19 infections.దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 July 2022 5:23 AM GMT
కొన‌సాగుతున్న క‌రోనా వ్యాప్తి.. కొత్త‌గా ఎన్నికేసులంటే

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 4,98,034 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 20,557 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,38,03,619కి చేరింది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు 5,25,785 మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి మ‌ర‌ణించారు.

నిన్న 18,517 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,31,13,623కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,45,654 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.47 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.13 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 200.61 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story