భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే

India Reports 1997 new covid 19 cases.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Oct 2022 4:46 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 2,13,123 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 1,997 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. నిన్న 3,908 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న‌వారి సంఖ్య 4,40,47,344 మందికి చేరింది. నిన్న6 గురు మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,28,754 కి చేరింది.

ప్ర‌స్తుతం దేశంలో 30,362 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.75 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 0.94 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 3,97,407 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 218.88 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story