క‌రోనా త‌గ్గుముఖం.. కొత్త కేసులు ఎన్నంటే..?

India Reports 1968 new covid-19 cases.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోకి వ‌స్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Oct 2022 6:41 AM GMT
క‌రోనా త‌గ్గుముఖం.. కొత్త కేసులు ఎన్నంటే..?

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోకి వ‌స్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 2,09,801 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 1,968 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. నిన్న 3,481 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న‌వారి సంఖ్య 4,40,36,152 మందికి చేరింది. నిన్న7 గురు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,28,716కి చేరింది.

ప్ర‌స్తుతం దేశంలో 34,598 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.74 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 0.94 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 3,44,525 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 218.80 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story