స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు

India Reports 19673 new corona infections.దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న దేశ వ్యాప్తంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 July 2022 4:39 AM GMT
స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న దేశ వ్యాప్తంగా 3,96,424 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 19,673 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,40,19,811కి చేరింది. గత 24 గంటల్లో 39 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,26,357కి చేరింది.

నిన్న 19,673 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,33,49,778 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,43,676 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.48శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.96 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 31,36,029 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 204.25 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story