దేశంలో అదుపులోనే కరోనా..!
India Reports 1946 new covid-19 cases.దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది.
By తోట వంశీ కుమార్ Published on 19 Oct 2022 10:22 AM ISTదేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. రోజువారి కేసుల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,60,806 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా కొత్తగా 1,946 పాజిటివ్ కేసులు వచ్చాయి. నిన్న 2,417 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 4,40,79,485. దేశంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,28,923కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 25,968 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.75 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 0.75 శాతంగా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిన్న 3,76,787 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 219.41 కోట్ల డోసులను పంపిణీ చేశారు.
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) October 19, 2022
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/FlWpoZqwqT pic.twitter.com/cP2HWalKIF
ఇదిలా ఉంటే.. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు వెలుగులోకి రావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. దీపావళి సెలవుల వేళ ఈ వేరియంట్ విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రెండు, మూడు వారాలు అత్యంత కీలకమని అంటున్నారు.