దేశంలో కొత్త‌గా 1906 కేసులు.. 81 మ‌ర‌ణాలు

India Reports 1906 new corona infections.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి పూర్తిగా అదుపులోకి వ‌స్తోంది. గ‌త కొద్ది రోజులుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 April 2022 10:30 AM IST
దేశంలో కొత్త‌గా 1906 కేసులు.. 81 మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి పూర్తిగా అదుపులోకి వ‌స్తోంది. గ‌త కొద్ది రోజులుగా రోజువారి కేసులు 1500 లోపు న‌మోదు కాగా.. తాజాగా వెయ్యి దిగువ‌కు దిగి వ‌చ్చాయి. గ‌డిచిన 24 గంటల్లో 4,65,904 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 1,906 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,28,941కి చేరింది. నిన్న81 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన వారి సంఖ్య 5,21,345కి చేరింది.

ఒక్క రోజులో 1,447 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,24,93,773కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 13,013 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.76, రోజువారి పాజిటివిటీ రేటు కూడా 0.24 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 12,75,495 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,84,66,86,260 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story