భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 4,52,430 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 18,819 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,34,52,164కి చేరింది. నిన్నకరోనా కారణంగా 39 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,25,116కి చేరింది.
నిన్న 13,827 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,28,22,493కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,04,555 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.55 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.16శాతంగా ఉంది. దేశం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిన్న 14,17,217 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు 1,97,61,91,554 డోసులను పంపిణీ చేశారు.