అదుపులోనే క‌రోనా.. కొత్త‌గా ఎన్నికేసులంటే

India reports 1778 New Covid Infections.ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌రోసారి క‌రోనా వైర‌స్ ఆందోళ‌న‌కు గురి చేస్తోండ‌గా.. భార‌త్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 March 2022 5:12 AM GMT
అదుపులోనే క‌రోనా.. కొత్త‌గా ఎన్నికేసులంటే

ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌రోసారి క‌రోనా వైర‌స్ ఆందోళ‌న‌కు గురి చేస్తోండ‌గా.. భార‌త్‌లో మాత్రం అదుపులోనే ఉంది. గ‌డిచిన 24 గంటల్లో 6,77,218 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 1,778 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,12,749కి చేరింది. నిన్న 62 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,16,605కి చేరింది.

ఒక్క రోజులో 2,542మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,24,73,057కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 23,087 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.75, రోజువారి పాజిటివిటీ రేటు కూడా 0.26 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 30.5ల‌క్ష‌ల మంది టీకా తీసుకున్నారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,81,89,15,234 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story