దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా రోజువారి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న దేశ వ్యాప్తంగా 4,01,649 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 17,336 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,33,62,294కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 5218 కేసులు ఉన్నాయి. కేరళలో 3890, ఢిల్లీలో 1934, తమిళనాడులో 1063, హర్యానాలో 872, కర్ణాటకలో 858 కేసులు నమోదయ్యాయి.
నిన్నకరోనా కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,24,954కి చేరింది. నిన్న 13,029 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,27,49,056కి చేరింది. ప్రస్తుతం దేశంలో 88,284 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.59 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.32శాతంగా ఉంది. దేశం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. మొత్తంగా ఇప్పటి ఇప్పటి వరకు 196.77 కోట్ల డోసులను పంపిణీ చేశారు.