దేశంలో కొత్త‌గా 17,092 క‌రోనా పాజిటివ్ కేసులు

India Reports 17092 new covid-19 infections.దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. కొత్త‌గా 17,092 పాజిటివ్ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 July 2022 4:52 AM GMT
దేశంలో కొత్త‌గా 17,092 క‌రోనా పాజిటివ్ కేసులు

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. కొత్త‌గా 17,092 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శనివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,34,86,326కి చేరింది. నిన్న‌క‌రోనా కార‌ణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 5,25,168కి చేరింది.

నిన్న 14,684 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,28,51,590కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,09,568 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.54 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.14శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 197.84 కోట్ల‌ డోసులను పంపిణీ చేశారు.

Next Story