దేశంలో రోజు వారి కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 5,02,150 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 17,070 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,34,69,234కి చేరింది. నిన్నకరోనా కారణంగా 23 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,25,139కి చేరింది.
నిన్న 14,413 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,28,36,906కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,07,189 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.55 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 3.40శాతంగా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 197.74 కోట్ల డోసులను పంపిణీ చేశారు.