భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. 17వేల‌కు చేరువ‌గా కొత్త కేసులు

India Reports 16906 new covid-19 infections.క‌రోనా వైర‌స్ వ్యాప్తి అదుపులోనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 4,59,302 క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 July 2022 4:40 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. 17వేల‌కు చేరువ‌గా కొత్త కేసులు

క‌రోనా వైర‌స్ వ్యాప్తి అదుపులోనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 4,59,302 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 16,906 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,36,69,850కి చేరింది. నిన్న‌క‌రోనా కార‌ణంగా 45 మంది మ‌ర‌ణించారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డి 5,25,519మంది ప్రాణాలు కోల్పోయారు.

నిన్న 15,447 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,30,11,874కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,32,457 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.49 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 3.68 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 199.12కోట్ల‌ డోసులను పంపిణీ చేశారు.

Next Story