త‌గ్గిన కేసులు.. మ‌ర‌ణాలు ఎన్నంటే..?

India Reports 1685 New Corona infections.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 March 2022 4:57 AM GMT
త‌గ్గిన కేసులు.. మ‌ర‌ణాలు ఎన్నంటే..?

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గింది. గ‌డిచిన 24 గంటల్లో 6,91,425 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 1,685 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,16,372కి చేరింది. నిన్న 83 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన వారి సంఖ్య 5,16,755కి చేరింది.

ఒక్క రోజులో 2,499మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,24,78,087కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 21,530 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.75, రోజువారి పాజిటివిటీ రేటు కూడా 0.24 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 29.8 ల‌క్ష‌ల మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 182.55కోట్ల‌ డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story