భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. 4,100 మరణాలు ఎందుకొచ్చాయంటే

India Reports 1660 new corona infections.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉంది. గ‌డిచిన 24 గంటల్లో 6,58,489 మందికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 March 2022 10:48 AM IST
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. 4,100 మరణాలు ఎందుకొచ్చాయంటే

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉంది. గ‌డిచిన 24 గంటల్లో 6,58,489 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 1,660 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శ‌నివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,18,032కి చేరింది. నిన్న 4100 మంది మ‌ర‌ణించారు. మ‌హారాష్ట్ర‌(4,007), కేర‌ళ‌లో(81) మ‌ర‌ణాల సంఖ్యను స‌వ‌రించ‌డంతో భారీ స్థాయిలో తేడా క‌నిపించింది. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన వారి సంఖ్య 5,20,855కి చేరింది.

ఒక్క రోజులో 2,349 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,24,80,436కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 16,741 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.75, రోజువారి పాజిటివిటీ రేటు కూడా 0.25 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 29.07 ల‌క్ష‌ల మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,82,87,68,476 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story