భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కొత్తగా 1,604 కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,53,266కి చేరింది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,29,016.
నిన్న 2,081 మంది కోలుకోగా.. మొత్తంగా ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,41,04,933కి చేరింది. ప్రస్తుతం దేశంలో 18,317 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.77 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.02 శాతంగా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిన్న 1,39,111 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 219.63 కోట్ల డోసులను పంపిణీ చేశారు.