త‌గ్గిన కేసులు.. పెరిగిన మ‌ర‌ణాలు

India reports 15815 new Covid-19 cases.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రోజువారి కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతూనే ఉన్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Aug 2022 10:57 AM IST
త‌గ్గిన కేసులు.. పెరిగిన మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రోజువారి కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 3,62,802 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 15,815 కేసులు వ‌చ్చాయి. నిన్న దేశ వ్యాప్తంగా 68 మంది క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 5,26,996కి చేరింది. నిన్న 20,018 కోలుకోగా మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 4,35,93,112 మంది ఈ మ‌హ‌మ్మారిని జ‌యించారు.

ప్ర‌స్తుతం దేశంలో 1,19,264 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.54 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.36 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 24,43,064 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 207.71 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story