దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో 5,68,471 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 1,581 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,10,971కి చేరింది. నిన్న 33 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,16,543కి చేరింది.
ఒక్క రోజులో 2,741మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,24,70,515కి చేరింది. ప్రస్తుతం దేశంలో 23,913 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.74, రోజువారి పాజిటివిటీ రేటు కూడా 0.28 శాతంగా నమోదు అయింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,81,56,01,944 డోసులను పంపిణీ చేశారు.