దేశంలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు

India Reports 15754 new covid-19 cases.దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. మంగ‌ళ‌వారం వ‌ర‌కు 8 వేల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Aug 2022 4:37 AM GMT
దేశంలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. మంగ‌ళ‌వారం వ‌ర‌కు 8 వేల‌కు త‌గ్గిన రోజువారి కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 4,54,491 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 15,754 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. వీటితో క‌లుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,43,14,618కి చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 47 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 5,27,253 మంది మ‌ర‌ణించారు. గ‌డిచిన 24 గంట‌ల్లో 15,220 మంది కోలుకోగా.. మొత్తం 4,36,85,535 మంది ఈ మ‌హ‌మ్మారిని జ‌యించారు. ప్ర‌స్తుతం దేశంలో 1,01,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.58 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 3.47 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 31.5ల‌క్ష‌ల మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 209.27 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story