దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 4,33,659 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 14,506 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,34,33,345కి చేరింది. నిన్నకరోనా కారణంగా 30 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,25,077కి చేరింది.
నిన్న 11,574 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,28,08,666కి చేరింది. ప్రస్తుతం దేశంలో 99,602 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.56 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 3.35శాతంగా ఉంది. దేశం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిన్న 13.44లక్షల మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు 197.46 కోట్ల డోసులను పంపిణీ చేశారు.