14వేల‌కు దిగొచ్చిన కొత్త కేసులు

India Reports 14092 new covid-19 cases.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌త కొద్ది రోజులుగా 16వేల‌కు పైగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Aug 2022 10:49 AM IST
14వేల‌కు దిగొచ్చిన కొత్త కేసులు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌త కొద్ది రోజులుగా 16వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతుండ‌గా తాజాగా 14 వేల‌కు దిగివ‌చ్చింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 3,81,861 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 14,092 కేసులు వ‌చ్చాయి. నిన్న దేశ వ్యాప్తంగా 41 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 5,27,037కి చేరింది. నిన్న 14,092 మంది కోలుకోగా మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 4,36,09,566 మంది ఈ మ‌హ‌మ్మారిని జ‌యించారు.

ప్ర‌స్తుతం దేశంలో 1,16,861 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.54 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 3.69 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 28,01,457 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 207.99 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story