దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
India Reports 13313new corona infections.దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 6,56,410
By తోట వంశీ కుమార్ Published on
23 Jun 2022 4:38 AM GMT

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 6,56,410 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 13,313 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,33,44,958కి చేరింది. నిన్నకరోనా కారణంగా 38 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,24,941కి చేరింది.
నిన్న 10,972 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,27,36,027కి చేరింది. ప్రస్తుతం దేశంలో 83,990 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.60 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2.03శాతంగా ఉంది. దేశం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. మొత్తంగా ఇప్పటి ఇప్పటి వరకు 196.62 కోట్ల డోసులను పంపిణీ చేశారు.
Next Story