భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. 13వేల కొత్త కేసులు..రిక‌వ‌రీలు ఎన్నంటే..?

India Reports 13086 new covid-19 infections.దేశంలో క‌రోనా వైర‌స్‌ రోజువారి పాజిటివ్ కేసుల్లో హెచ్చుత‌గ్గులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 July 2022 4:45 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. 13వేల కొత్త కేసులు..రిక‌వ‌రీలు ఎన్నంటే..?

దేశంలో క‌రోనా వైర‌స్‌ రోజువారి పాజిటివ్ కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతూనే ఉన్నాయి. నిన్న 16 వేల‌కు పైగా కేసులు న‌మోదు కాగా.. నేడు 13 వేలకు దిగి వ‌చ్చింది. నిన్న దేశ వ్యాప్తంగా 4,51,312 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 13,086 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,31650కి చేరింది. నిన్న‌క‌రోనా కార‌ణంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డి 5.25ల‌క్ష‌ల మందికి పైగా మ‌ర‌ణించారు.

నిన్న 12,456 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,28,91,933కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,14,475 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.53 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2.90శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 198.09కోట్ల‌ డోసులను పంపిణీ చేశారు.

Next Story