దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న దేశ వ్యాప్తంగా 5,19,903 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 12,847 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,70,217 కి చేరింది. నిన్నకరోనా కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,24,817 కి చేరింది.
నిన్న7,985 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,26,82,697కి చేరింది. ప్రస్తుతం దేశంలో 63,063 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.64 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2.47 శాతంగా ఉంది. నిన్న 15.27లక్షల మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 195.84 కోట్ల డోసులను పంపిణీ చేశారు.