త‌గ్గేదే లే.. మ‌రోసారి 12వేల‌కు పైనే కేసులు

India Reports 12781 new Corona infections.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న‌ దేశ వ్యాప్తంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jun 2022 4:35 AM GMT
త‌గ్గేదే లే.. మ‌రోసారి 12వేల‌కు పైనే కేసులు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న‌ దేశ వ్యాప్తంగా 2,96,050 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 12,781 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు సోమ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,33,09,473కి చేరింది. నిన్న‌క‌రోనా కార‌ణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 5,24,873 కి చేరింది.

నిన్న 8,537 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,27,07,900కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 76,700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.61 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.32శాతంగా ఉంది. దేశం క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. మొత్తంగా ఇప్ప‌టి ఇప్పటి వరకు 196,18,66,707 డోసులను పంపిణీ చేశారు.

Next Story