దేశంలో భారీగా పెరిగిన కేసులు, మ‌ర‌ణాలు

India Reports 12608 new covid-19 cases.దేశంలో రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొన‌సాగుతున్నాయి. నిన్న 10వేల లోపు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Aug 2022 4:54 AM GMT
దేశంలో భారీగా పెరిగిన కేసులు, మ‌ర‌ణాలు

దేశంలో రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొన‌సాగుతున్నాయి. నిన్న 10వేల లోపు కేసులు న‌మోదు కాగా.. నేడు ఆ సంఖ్య 12 వేలు దాటింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 3,62,020 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 12,608 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. వీటితో క‌లుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,42,98,864కి చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 72 మంది మ‌ర‌ణించారు.

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 5,27,206 మంది ప్రాణాలు కోల్పోయారు. గ‌డిచిన 24 గంట‌ల్లో 16,251 మంది కోలుకోగా.. మొత్తం 4,36,70,315 మంది ఈ మ‌హ‌మ్మారిని జ‌యించారు. ప్ర‌స్తుతం దేశంలో 1,01,343 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.58 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 3.48 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 38,64,471 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 208.95 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story