దేశంలో కొత్త‌గా 1,259 కేసులు.. 35 మ‌ర‌ణాలు

India Reports 1259 New corona infections.దేశంలో కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 5,77,559 మందికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 March 2022 5:03 AM GMT
దేశంలో కొత్త‌గా 1,259 కేసులు.. 35 మ‌ర‌ణాలు

దేశంలో కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 5,77,559 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 1,259 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,20,712కి చేరింది. నిన్న 35 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన వారి సంఖ్య 5,21,070కి చేరింది.

ఒక్క రోజులో 1,700 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,24,85,534కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 15,378 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.75, రోజువారి పాజిటివిటీ రేటు కూడా 0.22 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 25.9ల‌క్ష‌ల‌ మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,83,53,90,499 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story