దేశంలో కొత్త‌గా 1,233 కేసులు.. 31 మ‌ర‌ణాలు

India Reports 1233 new corona infections.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉంది. గ‌డిచిన 24 గంటల్లో 6,24,022 మందికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 March 2022 5:04 AM GMT
దేశంలో కొత్త‌గా 1,233 కేసులు.. 31 మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉంది. గ‌డిచిన 24 గంటల్లో 6,24,022 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 1,233 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,23,215కి చేరింది. నిన్న 31 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన వారి సంఖ్య 5,21,101కి చేరింది.

ఒక్క రోజులో 1,876 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,24,87,410కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 14,704 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.75, రోజువారి పాజిటివిటీ రేటు కూడా 0.20 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 26,34,080 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,83,82,41,743 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story