దేశంలో కొత్త‌గా 1,225 కేసులు.. 28 మ‌ర‌ణాలు

India Reports 1225 new corona infections.భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉంది. గ‌డిచిన 24 గంటల్లో 6,07,987 మందికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2022 10:20 AM IST
దేశంలో కొత్త‌గా 1,225 కేసులు.. 28 మ‌ర‌ణాలు

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉంది. గ‌డిచిన 24 గంటల్లో 6,07,987 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 1,225 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,24,440కి చేరింది. నిన్న 28 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన వారి సంఖ్య 5,21,129కి చేరింది.

ఒక్క రోజులో 1,594 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,24,89,004కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 14,307 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.76, రోజువారి పాజిటివిటీ రేటు కూడా 0.20 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 22.27ల‌క్ష‌ల మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 184.06 కోట్ల‌ డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story