దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిన్న, మొన్నటి వరకు 15 వేలకు పైగానే నమోదు అయిన పాజిటివ్ కేసులు నేడు 11 వేలకు దిగివచ్చాయి. నిన్న దేశ వ్యాప్తంగా 4,53,940 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 11,739 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,33,89,973కి చేరింది. నిన్నకరోనా కారణంగా 25 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,24,999కి చేరింది.
నిన్న 10,917 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,27,72,398కి చేరింది. ప్రస్తుతం దేశంలో 92,576 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.58 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2.59శాతంగా ఉంది. దేశం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిన్న 12,72,739 మంది టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి ఇప్పటి వరకు 197.08 కోట్ల డోసులను పంపిణీ చేశారు.