దేశంలో కొత్త‌గా 1150 కేసులు.. 83 మ‌ర‌ణాలు

India Reports 1150 new corona infections.దేశంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో 4,66,362

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 April 2022 9:59 AM IST
దేశంలో కొత్త‌గా 1150 కేసులు.. 83 మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో 4,66,362 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 1,150 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శ‌నివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,34,217కి చేరింది. నిన్న 83 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన వారి సంఖ్య 5,21,656కి చేరింది.

ఒక్క రోజులో 1,194 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,25,01,196కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 11,365 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.76, రోజువారి పాజిటివిటీ రేటు కూడా 0.25 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 14.7 ల‌క్ష‌ల‌ మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 185.55 కోట్ల‌ డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story