దేశంలో కొత్త‌గా 1109 కేసులు.. 43 మ‌ర‌ణాలు

India Reports 1109 new corona infections.దేశంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో 4,82,039

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 April 2022 10:07 AM IST
దేశంలో కొత్త‌గా 1109 కేసులు.. 43 మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో 1109 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,33,067కి చేరింది. నిన్న 43 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన వారి సంఖ్య 5,21,573కి చేరింది.

ఒక్క రోజులో 1,213 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,25,00,002కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 11,492 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.76, రోజువారి పాజిటివిటీ రేటు కూడా 0.24 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 16,80,118 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,85,38,88,663 కోట్ల‌ డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story