దేశంలో కొత్త‌గా 1088 కేసులు.. 26 మ‌ర‌ణాలు

India Reports 1088 new covid-19 infections.గ‌త కొద్ది రోజులుగా రోజువారి కేసుల్లో హెచ్చుత‌గ్గులు చోటు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 April 2022 10:02 AM IST
దేశంలో కొత్త‌గా 1088 కేసులు.. 26 మ‌ర‌ణాలు

గ‌త కొద్ది రోజులుగా రోజువారి కేసుల్లో హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటున్న‌ప్ప‌టికీ దేశంలో క‌రోనా వైర‌స్ అదుపులోనే ఉంది. గ‌డిచిన 24 గంటల్లో 1088 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,38,016కి చేరింది. నిన్న 26 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,21,736కి చేరింది.

ఒక్క రోజులో 1,081 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,25,05,410కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 10,870 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.76, రోజువారి పాజిటివ్ రేటు 0.25శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 15,05,332 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,86,07,06,449 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story