దేశంలో కొత్త‌గా 1,086 కేసులు.. 71 మ‌ర‌ణాలు

India reports 1086 new corona infections.దేశంలో క‌రోనా వైర‌స్ అదుపులోనే ఉంది. గ‌డిచిన 24 గంటల్లో 4,81,374 మందికి క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2022 4:46 AM GMT
దేశంలో కొత్త‌గా 1,086 కేసులు.. 71 మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా వైర‌స్ అదుపులోనే ఉంది. గ‌డిచిన 24 గంటల్లో 4,81,374 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 1,086 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,30,925కి చేరింది. నిన్న 71 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన వారి సంఖ్య 5,21,487కి చేరింది.

ఒక్క రోజులో 1,198 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,24,97,567కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 11,871 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.76, రోజువారి పాజిటివిటీ రేటు కూడా 0.23 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 15.4 ల‌క్ష‌ల మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1.85 కోట్ల‌ డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story