దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 3,92,837 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా కొత్తగా 10725 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,43,78,920కి చేరింది. నిన్న దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 34 మంది మరణించారు.
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 5,27,488 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 13,084 మంది కోలుకోగా.. మొత్తం 4,37,57,385 మంది ఈ మహమ్మారిని జయించారు. ప్రస్తుతం దేశంలో 94,047 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.60 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2.73 శాతంగా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిన్న 23,50,665 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 210.82 కోట్ల డోసులను పంపిణీ చేశారు.