దేశంలో పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

India Reports 10649 new corona cases.దేశంలో రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతూనే ఉన్నాయి. నిన్న‌టితో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2022 4:58 AM GMT
దేశంలో పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

దేశంలో రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతూనే ఉన్నాయి. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 4,07,906 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 10649 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,43,68,195కి చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 36 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 5,27,452 మంది మ‌ర‌ణించారు. గ‌డిచిన 24 గంట‌ల్లో 10,649 మంది కోలుకోగా.. మొత్తం 4,37,44,301 మంది ఈ మ‌హ‌మ్మారిని జ‌యించారు. ప్ర‌స్తుతం దేశంలో 96,442 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.59 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2.62 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 27,17,979 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 210.58 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story