దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో 4,18,345 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 1,054 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,35,271కి చేరింది. నిన్న 28 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,21,685కి చేరింది.
ఒక్క రోజులో 1,258 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,25,02,454కి చేరింది. ప్రస్తుతం దేశంలో 11,132 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.76, మరణాల రేటు1.21శాతంగా నమోదు అయింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 14,38,792 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,85,70,71,655 డోసులను పంపిణీ చేశారు.